🔴
Loading latest posts...

Saturday, May 16, 2026

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...



నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు మలోతు అఖిల్, సర్పంచ్ మలోతు నాగు, మలోతు వినోద్, నాగు, ఈశ్వర్, మహేష్, సైదా తదితరులు పాల్గొన్నారు.

పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..

పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..



పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ నేరేడుచర్లలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు.

Thursday, May 14, 2026

ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?

ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?

ఇంధన పొదుపు కోసం మే 14 నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ తన కాన్వాయ్లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని, ప్రజలు కూడా సహకరించాలని ఇలా చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

రాజకీయాలకు బొత్స గుడ్ బై...

రాజకీయాలకు బొత్స గుడ్ బై...

AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల తర్వాత అనారోగ్యానికి గురైన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కుప్పకూలిపోయారు. ఈ నేపథ్యంలో, ఆయన శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పదవి నుంచి తప్పుకుంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీనిపై సీనియర్లతోచర్చించనున్నారని సమాచారం.

నీరు లేకపోతే ఎలా? అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

నీరు లేకపోతే ఎలా? అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి కీలకమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. శ్రీశైలంలో గరిష్ఠ సామర్థ్యం 215.81 TMCలు కాగా ప్రస్తుతం 39.2 TMCల నీరు ఉంది. ఇక డెడ్ స్టోరేజీ 810 అడుగులకు గానూ 817.7 అడుగుల నీటి నిల్వలున్నాయి. అటు సాగర్లో 312.05 TMCలకు గానూ 157.42 TMCల నీరు ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా 524 అడుగులకు చేరింది. ఇక పులిచింతలలో 32.42TMC (45.77TMC)ల నీరు ఉంది..!

నీట్ పేపర్ లీక్‌పై బీజేపీపై బీఆర్‌ఎస్ విమర్శలు...

నీట్ పేపర్ లీక్‌పై బీజేపీపై బీఆర్‌ఎస్ విమర్శలు...

నేరేడుచర్లలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే మరోసారి నీట్ పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. పగలు రాత్రి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందన్నారు. పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా కేంద్ర పాలన మారిందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...